Homeసినిమాకన్నడ సినిమాపై దిల్ రాజు రూ.120 కోట్ల భారీ పందెం.. కెరీర్‌లోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ డీల్!

కన్నడ సినిమాపై దిల్ రాజు రూ.120 కోట్ల భారీ పందెం.. కెరీర్‌లోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ డీల్!

క్రైమ్ మిర్రర్, సినిమా:- కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.120 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది దిల్ రాజు కెరీర్‌లోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ ఒప్పందంగా చెప్పబడుతోంది.సంక్రాంతి విడుదలలను మినహాయిస్తే, 2026లో డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజుకు పెద్దగా కలిసి రాలేదు. ఆయన విడుదల చేసిన శర్వానంద్ బైకర్, తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం, విరాట్ అశ్విన్ నాగబంధం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. దీంతో ఈ ఏడాది డిస్ట్రిబ్యూషన్ పరంగా పెద్ద విజయాన్ని అందుకోవాల్సిన అవసరం దిల్ రాజుకు ఏర్పడింది.

RC17లో రామ్ చరణ్ సరసన స్టార్ హీరో భార్య!

ఇలాంటి సమయంలో యశ్ టాక్సిక్ చిత్రంపై దిల్ రాజు భారీగా పెట్టుబడి పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా నిజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విడుదలకు ముందే భారీ మొత్తాన్ని సమీకరించాల్సి ఉండటంతో ఈ డీల్ దిల్ రాజుకు అత్యంత కీలకంగా మారింది.ఈ ఒప్పందం రీఫండబుల్ మోడల్‌లో జరిగినట్లు సమాచారం. అంటే సినిమా ఫలితాన్ని బట్టి ఆర్థిక పరంగా కొంత భద్రత ఉండేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. అయినప్పటికీ రూ.120 కోట్ల స్థాయిలో పెట్టుబడి పెట్టడం దిల్ రాజు నుంచి వచ్చిన పెద్ద నిర్ణయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.టాక్సిక్ చిత్రానికి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తున్న ప్రధాన చిత్రం కావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు