Homeజాతీయంభారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. విజయవంతమైన ‘విక్రమ్-1’ ప్రయోగం

భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. విజయవంతమైన ‘విక్రమ్-1’ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టం నమోదైంది. ప్రైవేట్ సంస్థ రూపొందించిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’  ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుంచి విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తవడంతో కంట్రోల్ రూమ్‌లో ఉన్న శాస్త్రవేత్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకుంటూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత బలపడింది. స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్.. దేశీయ అంతరిక్ష సాంకేతికతలో ప్రైవేట్ రంగ సామర్థ్యాన్ని చాటిచెప్పింది.

ఇస్రో ఛైర్మన్ నారాయణన్‌తో పాటు పలువురు మాజీ ఛైర్మన్లు, సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విజయంపై అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.

ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు కొత్త అవకాశాలను తెరిచే ఈ ప్రయోగం.. భవిష్యత్‌లో ఉపగ్రహ ప్రయోగాల రంగంలో భారత్ మరింత ముందుకు సాగేందుకు దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

also read: హైవేపై విమానం.. ట్రాలీపై వెళ్తున్న దృశ్యం వైరల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు