క్రైమ్ మిర్రర్,జాతీయం:- మహిళలు పురుషుల్లో ప్రధానంగా ఏ లక్షణాలను చూసి ఆకర్షితులవుతారు? అందం, ఆస్తి, లేదా ప్రభుత్వ ఉద్యోగమా? అంటే కాదనే చెబుతున్నారు ప్రముఖ డేటింగ్ కోచ్ జేమీ. ఈ విషయాలపై ఆయన స్పందిస్తూ, పురుషుల్లో మహిళలు ప్రధానంగా ఇష్టపడే మూడు ముఖ్యమైన లక్షణాలను వివరించారు.జేమీ తెలిపిన వివరాల ప్రకారం, మహిళలు ఈ క్రింది లక్షణాలున్న పురుషులను ఎక్కువగా ఇష్టపడతారు:
అహం లేని ఆత్మవిశ్వాసం:- తమపై తాము నమ్మకం ఉంటూనే, ఎదుటి వారిని గౌరవించే, అహంకారం లేని పురుషులను మహిళలు ఇష్టపడతారు.
సెన్స్ ఆఫ్ హ్యూమర్:- సరదాగా ఉంటూ, సందర్భోచితంగా నవ్వించగలిగే పురుషులు మహిళలను ఇట్టే ఆకర్షిస్తారు.
జీవిత లక్ష్యం:- జీవితంలో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగే, నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుంటూ పోయే వారిని మహిళలు అమితంగా ఇష్టపడతారు.అరిచి గోల చేయకుండా, తమ భావాలను నిశ్శబ్దంగా మరియు స్పష్టంగా వ్యక్తపరిచే వారు, తీయని మాటలతో నవ్వించగలిగే వారు, ఒక ఆశయంతో ముందుకు సాగేవారు మహిళలకు బాగా నచ్చుతారని జేమీ వివరించారు.