Homeసినిమాఆమిర్ ఖాన్ పెళ్లిపై వివాదం.. మత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత

ఆమిర్ ఖాన్ పెళ్లిపై వివాదం.. మత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ వివాహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జూలై 5న వీరిద్దరూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ వివాహం అనంతరం కొన్ని మత వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఆమిర్ ఖాన్ అంతర్మత వివాహం చేసుకోవడంపై అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య… అమీర్ ను చంపిన వాళ్లకు రూ. 5 కోట్లు రివార్డ్ ప్రకటించడం వంటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమిర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆయనకు సంబంధించిన వివాదాస్పద ప్రకటనలు చేశారు. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

also read: వైరల్ అయిన గుండు వీడియో వెనుక అసలు నిజం ఇదే.. పెళ్లి కోసం కాదంటున్న కీర్తన మీనన్

మరోవైపు కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు కూడా ఆమిర్ ఖాన్ వివాహాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ముస్లిం మత పెద్దల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. దారుల్ ఇఫ్తా షాహీకి చెందిన ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్, ముస్లిం వ్యక్తి ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడంపై షరియా నిబంధనలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆమిర్ ఖాన్ ఈ విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు.

అయితే ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ ఇద్దరూ చట్టపరమైన నిబంధనల ప్రకారం, తమ వ్యక్తిగత నిర్ణయంతో వివాహం చేసుకున్నారు. భారత చట్టం ప్రకారం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఈ వివాహంపై వస్తున్న వివాదాలపై ఆమిర్ ఖాన్ దంపతులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి మతపరమైన అంశాలను తీసుకురావడంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

also read: అమెరికాలో టైమ్‌ మార్చే పద్ధతికి గుడ్‌బై? ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’కు ఆమోదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు