క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్ :- ప్రముఖ నటుడు,దర్శకుడు, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ప్రకటించారు. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై అభిమానుల సలహాలు, సూచనలు కోరుతూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.”ఒకవేళ మీరు వద్దు అంటే రాజకీయాల్లోకి రాను, సమాజానికి నా వంతు సేవను ఇలాగే కొనసాగిస్తాను. మీరు ఓకే చెబితే పాలిటిక్స్ లోకి వస్తాను. మీ ఆశీర్వాదాలతో ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించబోతున్నానో త్వరలో చెబుతాను” అని లారెన్స్ ఆ వీడియోలో పేర్కొన్నారు.తన సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఎంతో మందికి చేరువైన లారెన్స్, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాననడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ఈ రోజుల్లో ఏ సెలబ్రిటీ అయినా సరే ఒక పని చేయాలి అంటే సులభంగా అయిపోతుంది. కానీ రాఘవ లారెన్స్ మాత్రం రాజకీయాల్లోకి రావడానికి తనను ఈ స్థాయికి తీసుకు వచ్చినటువంటి ఫ్యాన్స్ ను అడగడం ప్రతి ఒక్కరికి ఈ విషయం ఇప్పటికీ ఆసక్తికరంగానే మారింది. ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తే ఇంకెన్నో చేస్తారని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అభిమానులు ఆయన నిర్ణయంపై ఎలాంటి స్పందన తెలియజేస్తారో చూడాలి.
జనసేన జాతీయ రాజకీయాలపై ఫోకస్…! మూడు రోజుల పాటు కార్యక్రమాలు….
జేసీ దూకుడు…ప్రత్యర్థులక మాస్ వార్నింగ్…!