Homeతెలంగాణజేసీ దూకుడు...ప్ర‌త్య‌ర్థుల‌క మాస్ వార్నింగ్‌...!

జేసీ దూకుడు…ప్ర‌త్య‌ర్థుల‌క మాస్ వార్నింగ్‌…!

అనంతపురం, క్రైమ్ మిర్ర‌ర్‌: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదీ మనసులో దాచుకోరు. మైకులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. ప్రత్యర్థులకు వార్నింగ్ లు ఇచ్చినా, తమ పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చినా అన్నీ ఓపెన్ గానే ఉంటాయి. ఏదీ గుట్టుగా చేయరు. రహస్య ఆదేశాలు ఇవ్వరు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్టయిల్ అంతే. అందుకే తరచూ వివాదాల్లోకి జేసీ కూరుకుపోతుంటారు. అయినా లెక్కచేయరు. సొంత పార్టీతో పాటు ప్రత్యర్థులను కూడా ఆయన కేర్ చేయరు. తనకు తాడిపత్రి మినహా మరొకటి అవసరం లేదన్నట్లు ఆయన వ్యవహార శైలి కొనసాగుతుంది. అసభ్య పదజాలంతో ప్రత్యర్థులను దూషించడంలోనూ ఆయనకు ఆయనే సాటి.తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై మాటల దాడి చేశారు. ఇంటికి వచ్చి నరుకుతా అంటూ ఓపెన్ గా మైకులోనే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో పాటు కేతిరెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేయడం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు. ప్రస్తుతం మున్సిపల్ ఛైర్మన్ కూడా కాదు. కానీ నియోజకవర్గంలో తాను చెప్పిందే జరగాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకు పోలీసులయినా.. ప్రత్యర్థులయినప్పటికీ ఎవరినీ వదలిపెట్టరు. అదే ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో పాటు అంతకు ముందు ఆయన చేసిన హెచ్చరికలు కూడా సోషల్ మీడియాలో వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల చేత నామినేషన్లను కూడా వేయించకుండా అడ్డుకోమని బహిరంగంగానే తన పార్టీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు.

నామినేషన్లు వేస్తే అడ్డుకోవాలని, అంతకు ముందే వారి ఇళ్లకు వెళ్లి వార్నింగ్ ఇవ్వమని చెప్పడంతో జేసీ అనుచరులు వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి హంగామా చేసి వచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను గెలవకుండా అడ్డుకున్నారని, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తమను స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించలేదని అన్నారు. ఇప్పడు ఆ బాధ వారికి రుచిచూపించాలని పిలుపు నివ్వడం చర్చనీయాంశమైంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు