Crime Mirror, Latest Updates: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందటే ఎన్నికలు ముగిసిన ఈ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఒక ఉప ఎన్నిక జరగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేశారు.
ఈ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టీవీ కే పార్టీ నుంచి ప్రముఖ సినీనటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ పోటీ చేసి గెలిచిన తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గం నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
విజయ్ ఇప్పటికే ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానం నుంచి రాఘవ లారెన్స్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు రాఘవ లారెన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. విజయకు రాఘవ లారెన్స్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలోనూ వీరిద్దరూ అనేక సినిమాల్లో నటించారు.
ఈ నేపథ్యంలోనే రాఘవ లారెన్స్ విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా రాఘవ లారెన్స్ వెనుక నుండి తన సహకారాన్ని విజయ్కు అందించినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ రాజీనామా చేసిన గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్న ఈ స్థానాన్ని ఆయనకు కేటాయిస్తున్నట్లు పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు.
-
ఈనెల 11న ప్రకటన చేస్తానన్న రాఘవ లారెన్స్..
రాఘవ లారెన్స్ టీవీకేలో చేరుతున్నట్లు, ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం స్పందించారు. ఈమెరకు తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టు పెట్టారు. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని ఈ నెల 11న ప్రకటిస్తానని వెల్లడించారు.
తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు వివిధ ప్రచారమాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయని, దీనిపై తన వివరణ కోరుతూ మీడియా మిత్రులు ఫోన్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచారంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను బెంజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, ఈనెల 10వ తేదీ వరకు చిత్రీకరణ ఉంటుందని లారెన్స్ వెల్లడించారు.
సినిమా చిత్రీకరణ పూర్తయిన మరుసటి రోజు అంటే ఈనెల 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన తల్లి ఆశీస్సులతో తన కెరీర్ కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. రాఘవ లారెన్స్ చేసిన ఈ ప్రకటనతో తమిళనాడులో మరింత ఆసక్తి నెలకొంది.
Also Reads:విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు… మూన్నాళ్ల ముచ్చటేనా అంటూ కామెంట్…!
సామాజిక సేవలు ద్వారా తమిళనాడులో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రాఘవ లారెన్స్.. ఎటువంటి ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. రాఘవ లారెన్స్ పెట్టిన పోస్ట్ ను బట్టి చూస్తే ఆయన రాజకీయాల్లో రావడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. తన తల్లి ఆశీస్సులతో కెరియర్ కు సంబంధించిన కీలకమైన ప్రకటన చేస్తానని చెప్పడం ద్వారా ఆయన పోటీకి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
గడచిన ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ భవిష్యత్తులో రాజకీయంగా అవసరమైన సినీ గ్లామర్ సంపాదించుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ను పార్టీలోకి ఆయన ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
భవిష్యత్తులో మరి కొంతమంది సినీ ప్రముఖులు పార్టీలో చేరే అవకాశం ఉందని తమిళనాడులో చర్చ జరుగుతుంది. రాఘవ లారెన్స్ పార్టీలో చేరడం పోటీ చేయడం ఖాయమైతే మరింతమంది ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.