Homeజాతీయంలారెన్స్ పొలిటికల్ ఎంట్రీ....జూన్ 11న ముహూర్తం ఖ‌రారు...!

లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ….జూన్ 11న ముహూర్తం ఖ‌రారు…!

చెన్నై, క్రైమ్ మిర్ర‌ర్‌: తమిళనాడు ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో కోలీవుడ్ స్టార్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించి స్టార్ హీరో విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తనదైన పాలన మార్క్‌తో దూసుకెళ్తున్నారు. ఆయన పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ జాయిన్ అవుతున్నారంటూ రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది.ఈ రూమర్స్‌కు లారెన్స్ చెక్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘నేను తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని పలు మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ప్రచారం జరుగుతోంది. నా మీడియా మిత్రులు కొందరు నాకు ఫోన్ చేసి దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ నన్ను కలవాలని అభ్యర్థిస్తున్నారు.

ఈ ఊహాగానాలు పెరిగిపోయి నేను దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని భావించినందున, ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా.నేను ప్రస్తుతం బెంజ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. నా షెడ్యూల్ 10వ తేదీతో ముగుస్తుంది. మా అమ్మగారి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయం 11వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు అనౌన్స్ చేస్తాను.’ అంటూ రాసుకొచ్చారు.ఏప్రిల్‌‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేసి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని తిరుచ్చి ఈస్ట్ వదులుకున్నారు.

దీంతో ఇక్కడ త్వరలోనే బై ఎలక్షన్ జరగనుంది.ఈ స్థానంలో లారెన్స్ టీవీకే తరఫు నుంచి పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపైనే ఈ నెల 11న ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. మరి ఆయన విజయ్ పార్టీలో చేరి పోటీలో నిలుస్తారా మరేదైనా ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తిగా మారిందిలారెన్స్ కేవలం నటనలోనే కాకుండా సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. తన తల్లి పేరు మీద అనాథలకు, వృద్ధులకు చేతనైన సాయం అందిస్తారు. అలాగే, మీడియాలో వచ్చిన కథనాలపైనా స్పందిస్తూ అవసరమైన వారికి తనకు తోచిన సాయం చేస్తుంటారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు