HomeUncategorizedప్రపంచంలోనే ఒకే ఒక్కడు... కోటి కోట్లకు అధిపతిగా ఎలాన్ మస్క్...!

ప్రపంచంలోనే ఒకే ఒక్కడు… కోటి కోట్లకు అధిపతిగా ఎలాన్ మస్క్…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ప్రపంచంలోనే ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్ మరో సరికొత్త రికార్డును సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించిన ఆయన మరో అరుదైన మైలురాయను అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆధునిక చరిత్రలో ఏ మానవుడు అందుకోలేని మైలురాయి దిశగా వేగంగా ప్రయాణం సాగిస్తున్నాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఆస్తుల విలువలను లెక్కించి ర్యాంకింగులు ఇచ్చే ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆయన ఆస్తుల నికర విలువ భారతదేశ కరెన్సీ ప్రకారం ఇప్పటికే 75 లక్షల కోట్లకు పైగానే ఉంది.

దీనికి తోడు ఇన్నాళ్లుగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఆయన స్పేస్ ఎక్స్ సంస్థ ఈనెల 12న ఐపీఓకు రానుంది. అంటే షేర్ మార్కెట్లోకి అడుగుపెడుతుంది. ఇందులో 50 శాతానికి పైగా వాటా కలిగి ఉన్న ఎలాన్ మస్క్ షేర్ మార్కెట్ లోకి స్పేస్ ఎక్స్ అడుగుపెడితే దాని ద్వారా వచ్చే ఆదాయంతో ట్రిలియన్ డాలర్ల ఆస్తి దాటుతుందని అంచనా వేస్తున్నారు. షేర్ మార్కెట్లోకి వచ్చిన తరువాత మస్క్ ఆస్తుల విలువ 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా ఎలాన్ మస్క్ చరిత్ర పుటల్లోకి చేరుకోనున్నాడు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే కోటి కోట్ల రూపాయల మార్కును మాస్క్ దాటనున్నాడు.

అనేక దేశాల వార్షిక జిడిపి కంటే ఎక్కువ…

ఎలాన్ మస్క్ ఆస్తులు ప్రపంచంలోని ప్రముఖ దేశాల వార్షిక జిడిపి కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానాల్లో ఉండే అమెజాన్ అధిపతి జఫ్ బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్, గూగుల్ సహా వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గి బ్రిన్ల ఆస్తులన్నీ కలిపితే ట్రిలియన్ డాలర్ల మార్కు దాటుతుంది. అలాంటిది మస్కు ఒక్కడి సంపద ఇంచుమించుగా వారికి దరదాపుల్లో ఉండడం గమనార్హం. మస్క్ ఉండేది అమెరికాలోనీ హ్యూస్టన్ నగరంలో. అమెరికాలోని అతిపెద్ద నగరాల జాబితాలో న్యూయార్క్ లాస్ ఏంజిల్స్ తర్వాత మూడో స్థానంలో ఉన్న నగరం అది. ఆ సిటీలోని మొత్తం నివాస వాణిజ్య భవనాలన్నింటి విలువ కలిపినా కూడా మస్క్ సంపద కన్నా తక్కువే. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 50 స్పోర్ట్స్ టీమ్స్ విలువ 353 మిలియన్ డాలర్లు.
ఎలాన్ మస్క్ కొనదల్చుకుంటే ఆ టీములన్నింటినీ ట్విట్టర్ కొన్నంత ఈజీగా కొనేయగలరు.

ఒక మిలియన్ డాలర్ అంటే మన కరెన్సీ లో 9.5 కోట్లు. గంటకు 9.5 కోట్లు చొప్పున రోజుకు 24 గంటలు ఏడాదికి 365 రోజులు ఖర్చు పెడుతూ పోయినా సరే ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలంటే 100 సంవత్సరాలకుపైగా పడుతుంది. ఆ ఖర్చుపెట్టే డబ్బు నుంచి తిరిగి ఎలాంటి ఆదాయము రాకపోతేనే ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి వందేళ్ళకుపైగా పడుతుంది. తిరిగి ఆదాయం వచ్చే లెక్క అయితే ఇంకెన్నాళ్లు పడుతుందో తెలియదు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో సంపాదన కలిగిన ఏకైక వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డులు సృష్టించాడు. భవిష్యత్తులో అతడిని అందుకునే దగ్గరలో కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ స్థాయిలో సంపాదన కలిగిన ఏకైక వ్యక్తిగా నిలిచిన ఎలాన్ మస్క్ భవిష్యత్తులో తన సంపాదన ద్వారా మరిన్ని రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతాడో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు