-
ఉపాసన సర్‌ప్రైజ్ గిఫ్ట్…!
-
త్రిష కు మెగా ఫ్యామిలీ నుంచి స్పెషల్..!
Crime Mirror, Cinema Latest Updates: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి, సామాజిక సేవల్లోనూ ముందుండే ఉపాసన కామినేని కొణిదెల మరోసారి తన స్వభావాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సెలబ్రిటీలతో మంచి అనుబంధం కొనసాగించే ఉపాసన, తాజాగా స్టార్ హీరోయిన్ త్రిష కు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ పంపించి వార్తల్లో నిలిచారు.
‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి స్పెషల్ ఫుడ్
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి ప్రత్యేకంగా తయారుచేసిన హోమ్ మేడ్ ఫుడ్ బాక్స్‌ను త్రిషకు పంపించారు ఉపాసన.
ఈ గిఫ్ట్ బాక్స్‌లో సంప్రదాయ ఆవకాయ పచ్చడి, స్వీట్ కేసరి, పొంగల్ , ఉప్మా , రసం ఇలా వివిధ ఇన్‌స్టెంట్ బ్రేక్‌ఫాస్ట్ పొడులు ఉన్నాయి. ఇవన్నీ ఇంటి రుచిని గుర్తు చేసేలా ప్రత్యేకంగా తయారుచేయబడ్డాయి.
ఈ గిఫ్ట్ అందుకున్న త్రిష చాలా ఆనందంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేస్తూ, ఉపాసనకు కృతజ్ఞతలు తెలుపుతూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.“ఈ వంటకాలు చూస్తుంటే సమ్మర్ స్పెషల్ ఫీల్ వస్తోంది” అంటూ ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఈ చిన్న గిఫ్ట్ సెలబ్రిటీల మధ్య ఉన్న బాండింగ్‌ను చూపించింది. సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది.
మెగా ఫ్యామిలీ మనసును మరోసారి హైలైట్ చేసింది. త్రిష, ఉపాసన మధ్య ఉన్న ఈ మంచి అనుబంధం అభిమానుల్లో కూడా పాజిటివ్ ఫీల్‌ను కలిగిస్తోంది.
“మనసుతో ఇచ్చే గిఫ్ట్‌కి విలువ ఎప్పటికీ తగ్గదు.”
ఇలాంటి చిన్న విషయాలే పెద్ద అనుబంధాలను మరింత బలంగా చేస్తాయి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం త్రిష, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు వచ్చిన ఈ గిఫ్ట్ మరింత స్పెషల్‌గా మారింది.