HomeసినిమాJanhvi Kapoor: ‘పెద్ది’కి పెద్ద తలనొప్పి జాన్వీ.. బాబోయ్.. బోర్ అంటున్న నెటిజన్స్!

Janhvi Kapoor: ‘పెద్ది’కి పెద్ద తలనొప్పి జాన్వీ.. బాబోయ్.. బోర్ అంటున్న నెటిజన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం మొదట ప్రీమియర్లలో మిక్స్‌ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, మార్నింగ్ షో నుంచి పాజిటివ్ వైపు వెళ్లింది. రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం అని సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వస్తున్నాయి. ఇతర హీరోల అభిమానులు కూడా చరణ్ నటనను అభినందిస్తున్నారు.

జాన్వీ పాత్రపై నెటిజన్ల అసంతృప్తి

అయితే, ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్రకు సరిపోలేదని, మిస్ కాస్టింగ్ అయిందని చాలా మంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి.  సౌత్ ఇండస్ట్రీలో పెద్ద ప్రాజెక్టుల్లో జాన్వీ కపూర్‌ను ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా నెటిజన్ల మధ్య చర్చకు దారితీశాయి. ఆమె మార్కెట్, ఇతర కారణాల వల్ల అవకాశాలు వస్తున్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అప్పుడు ‘దేవర’.. ఇప్పుడు ‘పెద్ది’

‘దేవర’ తర్వాత ‘పెద్ది’లో ఆమె పాత్ర కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాల్లో ఆమె ఎంపిక సరైనదేనా అనే చర్చ కూడా జరుగుతోంది. కొంతమంది అయితే ఈ సినిమా సక్సెస్ మీద ఆమె పాత్ర ప్రభావం నెగెటివ్ గా పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.  సోషల్ మీడియాలో అయితే ఈ అంశం ఎక్కువగా వైరల్ అవుతోంది. జాన్వీ పాత్ర సినిమాకు మైనస్‌గా మారిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా విజయంపై పూర్తి తీర్పు ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని కూడా కొందరు అంటున్నారు. మొత్తం మీద, ‘పెద్ది’లో రామ్ చరణ్ నటనకు మంచి స్పందన వస్తుండగా, జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం మిశ్రమ స్పందనలు కొనసాగుతున్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు