Homeఆంధ్ర ప్రదేశ్యువ‌తి మృతి కేసులో కీల‌క‌ప‌రిణామం...! హ‌త్యా కోణంలో విచార‌ణ‌....! నిందితుల అరెస్టు

యువ‌తి మృతి కేసులో కీల‌క‌ప‌రిణామం…! హ‌త్యా కోణంలో విచార‌ణ‌….! నిందితుల అరెస్టు

విశాఖ‌ప‌ట్నం, క్రైమ్ మిర్ర‌ర్: విశాఖపట్నంలో యువతి శాంతికుమారి మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా మారి హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అరెస్టైన వారిలో పి. సాయికుమార్ (24), ఆర్. లక్ష్మి (20), జి.వి. సాయిజశ్వంత్ (23), వి. సాయికిరణ్ (24), పి. మణి (19), ఎన్. సాయికుమార్ (25) ఉన్నారు. వీరిలో కొందరు ఇంజినీరింగ్ చదివినవారు కాగా, మరికొందరు ఇతర వృత్తుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అందరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, తర్వాత పరస్పర విభేదాలకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. ఘటనకు ముందు నిందితులు ఉద్దేశపూర్వకంగా సీసీటీవీ కెమెరాలను పక్కకు తిప్పినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి 9 గంటల సమయంలో ఒకసారి, 11:30 ప్రాంతంలో మరోసారి కెమెరాలను మార్చడం నమోదైంది. ఈ పరిణామం నేరం ముందుగానే ప్రణాళికతో జరిగిందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

అయితే అన్ని కెమెరాలు పూర్తిగా పనిచేయకుండా చేయలేకపోవడంతో, ఒక కెమెరాలో సంఘటనకు సంబంధించిన కీలక దృశ్యాలు రికార్డ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోల్లో బాధితురాలిపై దాడి జరిగిన దృశ్యాలు, నిందితుల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇవే కేసులో ప్రధాన సాక్ష్యాలుగా మారే అవకాశముంది. ఈ విషయంపై ఏసీపీ నరసింహమూర్తి మాట్లాడుతూ, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు కారణాలు పూర్తిగా బయటపడతాయని చెప్పారు.

ప్రాథమికంగా బాధ్యతారాహిత్యం కారణంగా ఒక యువతి ప్రాణం కోల్పోయిందని, ఈ ఘటనలో నిందితుల జీవితాలు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.ప్రస్తుతం కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించగా, పోస్ట్‌మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, నిందితుల ప్రవర్తన, ముందస్తు చర్యలు వంటి అంశాల ఆధారంగా ఈ ఘటనను హత్య కోణంలో లోతుగా విచారిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు