క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్ :-భారతీయ సినిమా చరిత్రలో ఎంతోమంది నటులు చరిత్ర సృష్టిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యి కొన్ని వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. మరికొన్ని భారీ బడ్జెట్ తో వచ్చినప్పటికీ సరైన కథ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డీలపడ్డ సినిమాలు కూడా ఉన్నాయి.కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా 1000 కోట్ల కలెక్షన్లలో చేరాలనే విధంగా సినిమాలు తీస్తున్నారు. కానీ ఒక ఆర్టిస్టుకు మాత్రం అతి కొద్ది సమయంలోనే అతను నటించినటువంటి నాలుగు సినిమాలు ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ది బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ రికార్డు సృష్టించారు. అత్యధికంగా 1000 కోట్లు వసూలు చేసిన చిత్రాల్లో నటించిన నటుడిగా సరికొత్త రికార్డు నమోదు చేశారు. సంజయ్ దత్ నటించినటువంటి కేజీఎఫ్ 2, దురంధర్ 1&2, జవాన్ ఈ నాలుగు సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. షారుక్ ఖాన్, ప్రభాస్ మరియు రణవీర్ వంటి స్టార్ హీరోల కంటే ఎక్కువగా నాలుగు సార్లు భారీ వసూలు సాధించిన చిత్రాల్లో ఈ నటుడు నటించడం ప్రత్యేకమైన విషయంగా భావించవచ్చు. ఈయన తరువాత హీరోయిన్లలో దీపిక పదుకొనే ఎక్కువగా మూడుసార్లు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో నటించారు. దీంతో సంజయ్ దత్ రెమ్యూనరేషన్ తో పాటు ఎక్కువగా సినిమా అవకాశాలు కూడా సాధిస్తున్నారు.
మన దేశంలో ముఖ్య పదవులు.. కనీస వయసు ఎంత ఉండాలో తెలుసా?
వాషింగ్ మిషన్ ఆన్ లో ఉంచి స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా?
