ఒకే రోజు 6160 మెగావాట్ల విద్యుత్
సీఎం చంద్రబాబు
అమరావతి, క్రైమ్ మిర్రర్: ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్(జెన్‌కో) ఒకేరోజు రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం గొప్ప శుభపరిణామమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ జెన్కో ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు.
ఈ నెల 11న 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ రికార్డు ఒక్కరోజే సాధించడం ఆంధప్రదేశ్ విద్యుత్ రంగానికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్‌కో ఎª`లాంట్ల కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి, మొత్తం జెన్‌కో టీమ్‌కు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోందనేందుకు ఈ ఘనత సాక్ష్యమని సీఎం వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జెన్‌కో సాధించే విజయాలు రాష్టాన్రికి మాత్రమే కాకుండా, దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఒకే రోజు 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించటం జెన్‌కోకి చరిత్రాత్మక ఘనత అని వెల్లడించారు. ఈ విజయంతో ఆంధప్రదేశ్ విద్యుత్ రంగం భవిష్యత్తులో మరిన్ని రికార్డులుసృష్టించేందుకు సిద్ధమైందని ఈసందర్భంగా తెలిపారు
