Homeసినిమాత్వరలోనే మరో ముద్దుగుమ్మ పెళ్లి?

త్వరలోనే మరో ముద్దుగుమ్మ పెళ్లి?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:-
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. గత కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన, అల్లు శిరీష్ మరియు నైనిక వివాహాలు చాలా ఘనంగా జరగగా త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ మరియు కావ్య రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయంపై ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే తాజాగా మరొక యువ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవతో బలగం సినిమాలోని హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమించుకుంటున్నట్లు త్వరలోనే వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేసే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని సినిమా వర్గాల్లో విస్తృతస్థాయిలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. దీంతో ఈ 2026 ఏడాది సినిమా సెలబ్రిటీల కెరియర్ కు, పెళ్లిళ్లకు అనుకూలంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది నవ్వులు పూయించే కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ పరిస్థితులలోనే ప్రభాస్ పెళ్లి కూడా జరిగిపోతే బాగుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క‌ నిర్ణ‌యం: ప్ర‌తి కుటుంబానికి ఫ్యామిలి కార్డు

Supreme Court: అతడిని చనిపోనివ్వండి, సంచలన తీర్పు చెప్పిన అత్యున్నత న్యాయస్థానం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు