Homeఅంతర్జాతీయంఉమెన్స్ డే: మహిళా మణులకు అభివందనాలు - ఇన్స్పెక్టర్ రవికుమార్

ఉమెన్స్ డే: మహిళా మణులకు అభివందనాలు – ఇన్స్పెక్టర్ రవికుమార్

  • ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారతకు గుర్తింపుగా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ లు వెంకటేష్, నోయల్ రాజు, సత్యనారాయణ, సైదయ్యలు, పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బందితో పాటు జీఎంఆర్ సంస్థకు చెందిన మహిళా సిబ్బందిని శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు.

ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి రంగంలో మహిళలు ముందుకు రావడం ఆనందదాయకమని తెలిపారు. మహిళలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది శోభ, శ్రావణి, శారద, అఖిల, పూజిత, అనుష, రజనీ, కావేరి, పద్మజ, భాను రేఖ,కృష్ణవేణి, శిల్ప, భార్గవి, స్వప్న లు కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది మరియు జీఎంఆర్ స్టాఫ్ పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు