Saturday, March 28, 2026
Homeజాతీయంఏడాదికి టోల్ చార్జీ జస్ట్ రూ. 3 వేలు.. కేంద్రం కీలక నిర్ణయం!

ఏడాదికి టోల్ చార్జీ జస్ట్ రూ. 3 వేలు.. కేంద్రం కీలక నిర్ణయం!

FASTag Annual Pass: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ చార్జీల నుంచి భారీ ఉపశమనాన్ని కల్పించబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నాన్ కమర్షియల్ వాహనాలకు వార్షిక టోల్ పాస్ లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జస్ట్ రూ. 3,000 చెల్లించి ఈ టోల్ పాస్ ను తీసుకోవచ్చు. ఈ పాస్ యాక్టివేట్ అయిన దగ్గరి నుంచి ఏడాదిలోగా 200 ట్రిప్పుల వరకు జర్నీ చెయ్యొచ్చు. ఈ విషయాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇబ్బందులు లేని ప్రయాణం కోసం ఈ నిర్ణయం తీసకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ పాస్ ను నాన్ కమర్షియల్ వాహనాలు అయిన కార్లు, జీపులు, వ్యాన్లు మొదలైన వాటికే వర్తించనుంది. జాతీయ రహదారులపై 60 కి.మీ. లోపే టోల్‌ ప్లాజాలు ఉండటంపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పాస్ లను ఆగష్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఫాస్టాగ్‌ పాస్‌ ప్రత్యేకతలు ఇవే!

* ఈ పాస్ ధర రూ.3,000. ఒకేసారి పేమెంట్ చేసి తీసుకోవాలి. ఏడాది పాటు 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. అన్ని జాతీయ రహదారులపై ఈ పాస్ పని చేస్తుంది.

* కార్లు, జీపులు, వ్యాన్లు లాంటి నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది.

* ప్రస్తుతం ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులు కొత్తగా మరో ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

* ఒక టోల్‌ ప్లాజాను దాటి వెళితే దానిని ఒక ట్రిప్పుగా లెక్కించబడుతుంది.

* ఈ పాస్ ద్వారా ఒక టోల్ ప్లాజాకు కేవలం రూ. 15 చెల్లించినట్టు అవుతుంది.

* ఏడాదిలోగా 200 ట్రిప్పులు పూర్తి అయితే, మళ్లీ పాస్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఏడాదికి ఎన్నిసార్లు అయినా ఈ పాస్ కొనుగోలు చెయ్యొచ్చు.

Read Also: పహల్గామ్ లో మళ్లీ తెరుచుకున్న పర్యాటక ప్రాంతాలు, టూరిస్టులు వచ్చేనా?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments