మూడు రోజులు వానలు, ఆ తర్వాత మళ్లీ ఎండలు!

0
221
rains for 3 days imd telangana weather report for this week
rains for 3 days imd telangana weather report for this week

Telangana Weather: హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిలు విచిత్రంగా ఉండబోతున్నాయి. రుతుపవనాలు ముందస్తుగా రావడంతో వాతావరణం చల్లబడగా, మళ్లీ ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఎండలు మండే అవకాశం ఉందని తెలిపింది.

ఇంతకీ వాతావరణశాఖ ఏం చెప్పిందంటే?

భారత వాతావరణ శాఖ(IMD) హైదరాబాదీలకు కాస్త కూల్ న్యూస్ చెప్పింది. జూన్ 7,8,9 తేదీల్లో ఆకాశం మేఘాలతో ఉంటుందని వెల్లడించింది. ఓ మోస్తారు వర్షం పడుతుందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఐఎండీ తాజా ప్రకటన నగర వాసులకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే మబ్బులు కనిపించడంతో కాస్త ఉపశమనం లభించినట్లు అయ్యింది.

మళ్లీ ఎండలు పెరుగుతాయా?

ఐఎండీ తాజా ప్రకటనలో వరుసగా మూడు రోజుల పాటు తేలిక వర్షాలు కురుస్తాయని చెప్పడంతో పాటు  జూన్ 10 నుండి హైదరాబాద్ లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమైన ఉంటుందని తెలిపింది. ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందదని తెలిపింది. జూన్ 11న మళ్లీ ఎండలు పెరుగుతాయని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు తిరిగి 37 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ప్రజలకు కీలక సూచనలు

నిజానికి రుతుపవనాలకు ముందు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవడం కామన్ అని ఐఎండీ తెలిపింది. ఇవి ఎండ నుంచి రిలీఫ్ ను ఇస్తాయి ఇప్ప, ప్రజలకు పెద్దగా ఇబ్బంది కలిగించవు అని వివరించింది. మధ్యాహ్నం లేదంటే రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకైనా మంచిది పనికి వెళ్లే వాళ్లు, స్కూల్‌కి వెళ్లే పిల్లలు, ఉద్యోగులు, ప్రయాణీకులు గొడుగు, రెయిన్ కోట్ తీసుకెళ్లాలని సూచించింది. వర్షం పడే సమయంలో రహదారులపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Read Also: ఇక మన దగ్గరే రాఫెల్ తయారీ, ఎరోస్పేస్ హబ్ గా హైదరాబాద్!