Tuesday, March 10, 2026
Homeతెలంగాణవలిగొండ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!.. ఒకరు మృతి!... పలువురికి గాయాలు?

వలిగొండ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!.. ఒకరు మృతి!… పలువురికి గాయాలు?

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్: :- యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వలిగొండ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్స్‌పెక్టర్ మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఏపీ39వై9688 గల వాహనం రెండు కార్లు నెంబర్ టీఎస్10ఈవి9520, టీఎస్05యూసి0854 గల కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో నరెశెట్టి శ్రావణి (29), సికింద్రాబాద్ కు చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

మాకు క్యాబినెట్ లో చోటు ఇవ్వండి…!

యాదగిరిగుట్టలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా రాజకీయ శిక్షణతరగతులను జయప్రదం చెయ్యండి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments