ఆంధ్ర ప్రదేశ్

99 రూపాయలకే లిక్కర్ బాటిల్.. పండగ చేసుకోండి.

99 రూపాయలకే లిక్కర్ క్వార్టర్ బాటిల్.. ఏంటీ షాకవుతున్నారా.. కాని ఇది నిజం. 99 రూపాయలపై నాణ్యమైన క్వార్టర్ మద్యం లభించబోతోంది. ఇది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోనే. చంద్రబాబు సర్కార్ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. తెలంగాణలో అమలవుతున్న విధానంలోనే మద్యం షాపులు ఏర్పాటు చేస్తోంది. గత ఐదేళ్లు జగన్ పాలనలో ప్రభుత్వం లిక్కర్ షాపులు నిర్వహించింది. ఆ సమయంలో నాసిరకమైన లిక్కర్ అమ్మారనే విమర్శలు వచ్చాయి. కల్తీ మద్యంతో చాలా మంది చనిపోయారని.. లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వచ్చాయి. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరగటానికి లిక్కరే ప్రధాన కారణమని చెబుతారు. అందుకే ఎన్నికల ప్రచారంలో లిక్కర్ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించారు చంద్రబాబు, పవన్.

అధికారంలోకి రాగనే మద్యం పాలసీపై ఫోకస్ చేసిన కూటమి సర్కార్.. రెండేళ్ల టైం బౌండ్‌తో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉదయం నుంచే అప్లికేషన్లు తీసుకుంటారు. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి 2 లక్షల రూపాయల చొప్పున నాన్‌ రిఫండబుల్‌ అమౌంట్‌ చెల్లించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయిస్తారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ప్రారంభించవచ్చు. అప్పటి వరకూ ప్రస్తుతమున్న ప్రభుత్వ దుకాణాలే యధాతథంగా కొనసాగుతాయి.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కొల్లి రవీదంర్ ప్రకటించారు. మందుబాబులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90లోపే నిర్ధారించాలని భావిస్తోంది. వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90 రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది ప్రభుత్వం.

Back to top button