
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-
ఆస్ట్రేలియన్ విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ తాజాగా జరిగినటువంటి అబుదాబి T10 లీగ్ ఫైనల్ లో విధ్వంసం సృష్టించారు. అబుదాబి T10 లీగ్ లో భాగంగా యూఏఈ బుల్స్ ప్లేయర్ గా టీమ్ డేవిడ్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఆస్పిన్ స్టాలియన్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 30 బంతుల్లోనే 98 పరుగులు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ మ్యాచ్ లో మూడు ఫోర్ ల తోపాటు ఏకంగా 12 సిక్సర్లను బాదాడు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే చివరి 9 బంతుల్లో టిమ్ డేవిడ్ ఏకంగా 7 సిక్సర్లు కొట్టాడు. డేవిడ్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆ జట్టు 10 ఓవర్లకు ఏకంగా 150 పరుగులు చేసింది. ఇక అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్పిన్ స్టాలియన్స్ జుట్టు కేవలం 70 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. దీంతో ఈసారి అబుదాబి T10 లీగ్ ఛాంపియన్ గా యూఏఈ బుల్స్ జట్టు నిలిచింది. సాధారణంగా టీమ్ డేవిడ్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మరి ఇంతటి విధ్వంసాన్ని మొట్టమొదటిసారిగా దగ్గరుండి చూసినటువంటి స్టేడియంలోని ప్రేక్షకులు అందరూ కూడా బిత్తరపోయారు అవాకయ్యారు.
Read also : మనదేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానం : జయ ప్రకాష్ నారాయణ
Read also : డేంజరస్ గా తుఫాన్లు.. ఈ మూడు దేశాల్లోనే 1100 మంది మృతి!





