
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి తాజాగా “వారణాసి” అని టైటిల్ కూడా అనౌన్స్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు నంది మీద కూర్చుని ఉన్నటువంటి వీడియో గ్లింప్స్ ను చూపించారు. మహేష్ బాబు మొదటి పోస్టర్ను చూడగానే ప్రతి ఒక్కరికి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇదే నేపథ్యంలో అసలు ఈ సినిమాకి గాను మహేష్ బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్నారు.
Read also : పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. రేపటి నుంచి వైన్స్ బంద్!
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఈ చిత్రం కోసం ఒక సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాతలతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు అని తాజాగా సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ మూవీ పూర్తి అయ్యేసరికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది కాబట్టి దాదాపు మహేష్ బాబుకు దగ్గర దగ్గరగా 150 నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మహేష్ బాబు మొన్నటి వరకు కూడా ఒక సినిమాకి 70 కోట్ల వరకు తీసుకుంటున్నారు. కానీ ఈ సినిమాతో తన రెమ్యూనరేషన్ భారీగా పెరిగిపోయినట్లు అర్థమవుతుంది. కాగా ఈ సినిమా 2027 మార్చిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలువురు ప్రముఖ వ్యక్తులు తెలిపారు. అయితే చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాతో మహేష్ బాబుకు పంట పండింది అని కామెంట్లు చేస్తుండగా మరి కొంతమంది ఎన్ని కోట్లు తీసుకున్నా అతను చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు ఉపయోగిస్తారు అని మహేష్ బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు.
Read also : Sexual Assault Case: నటిపై ప్రముఖ హీరో రేప్..?! సంచలనం





