
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్ :-
సాధారణంగా అమ్మాయిలపై యువకులు గ్యాంగ్ రేప్ అనే టైటిల్స్ సోషల్ మీడియాలో వింటూ ఉంటాం. కానీ తాజాగా జరిగిన సంఘటనలో ఒక యువకుడి పై నలుగురు అమ్మాయిలు గ్యాంగ్ రేప్ కు పాల్పడడం ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతుంది. పంజాబ్ లో జరిగిన ఈ ఘటనను .. సోషల్ మీడియాలో చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని జలందరకు చెందిన నలుగురు మహిళలు మద్యం మత్తులో రోడ్డుమీద తిరుగుతూ ఒంటరిగా కనిపించిన ఒక యువకుడిని కారులో బలవంతంగా ఎక్కించుకొని సిటీ ఔట్స్కట్స్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లుగా సమాచారం. అయితే అనంతరం బాధితులని రోడ్డుపై వదిలేసిన ఆ నలుగురు యువతులు అక్కడి నుంచి పరారయ్యారు. అనూహ్యంగా జరిగినటువంటి ఈ సంఘటనకు షాక్ అయిన బాధితుడు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ బాధితులని పరిశీలించిన వైద్యులు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని వెల్లడించారు. ఆ బాధితులు మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో కౌన్సిలింగ్ సేవలందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సాధారణంగా మహిళలకు ఈ సమాజంలో రక్షణ ఉందా అని ప్రశ్నించేటువంటి పరిస్థితులలో ఈరోజు యువకుడిపై అమ్మాయిలు దాడి చేయడంతో పురుషులకు భద్రత ఉందా అనే ప్రశ్నలు రేకెత్తుకున్నాయి.
Read also : షాకింగ్ న్యూస్… హ్యాక్ కు గురైన తెలంగాణ హైకోర్టు వెబ్సైట్?
Read also : డ్రగ్స్ పార్టీలో బాలీవుడ్ తారలు..?





