Saturday, March 28, 2026
Homeఆంధ్ర ప్రదేశ్26 ఎకరాలైనా ఇవ్వండి.. తల్లికి వందనమైనా ఇప్పించండి

26 ఎకరాలైనా ఇవ్వండి.. తల్లికి వందనమైనా ఇప్పించండి

కర్నూలు – కోడుమూరు రూరల్‌లో తల్లికి వందనం రాలేదని మహిళ ఆవేదన. నా ముగ్గురు పిల్లలకు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద డబ్బులు రాలేదని.. కారణం అడిగితే 26 ఎకరాల పొలముందంటూ చెబుతున్నారు అంటూ ఆవేదన దీంతో డబ్బులైనా ఇప్పించండి.. లేదా పొలమైనా చూపించండంటూ అధికారులను వేడుకున్న కోడుమూరుకు చెందిన గాయత్రి అనే మహిళ. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ నాగరాజుకు మొర పెట్టుకున్న మహిళ

తమకు నలుగురు సంతానం కాగా, ముగ్గురు కుమార్తెలు, రెండేళ్లలోపు ఒక బాలుడు ఉన్నారని.. ఇందులో ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం 1, 4, 5వ తరగతులు చదువుతుండగా, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని.. విషయం తెలుసుకోగా తమ కుటుంబం పేరు మీద 26 ఎకరాల భూమి ఉన్నట్లుగా చూపిస్తోందని, దీని వల్ల తమకు తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదని వాపోయింది మహిళ. తమ పేరు మీద కేవలం ఎకరా 85 సెంట్ల భూమి మాత్రమే ఉందని, అధికారులు చర్యలు తీసుకుని తమకు తల్లికి వందనం పథకం వర్తించేలా చూడాలని ఆమె తహసీల్దార్ మొరపెట్టుకున్న మహిళ

RELATED ARTICLES

Most Popular

Recent Comments