
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు సంవత్సరాల లో గోదావరి పురస్కారాలు జరగనున్నాయి. ఈ గోదావరి పుష్కరాలు అనేవి హిందువులు జరుపుకునే పవిత్ర నది ఉత్సవం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ పురస్కారాలకు పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి నది స్నానాలు చేసి తమ పాపాలన్ని పోవాలని కోరుకుంటారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత అనగా 2027 జూన్ లో గోదావరి పుష్కరాల కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటినుంచి భారీ కసరత్తులు చేస్తోంది. పుష్కరాలకు వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేలా ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గోదావరి నది ప్రవహించేటువంటి ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో దాదాపు 500 కు పైగా ఘాట్లు సిద్ధం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాలని భావిస్తుంది. అయితే చివరిసారిగా 2017వ సంవత్సరంలో జరిగిన ఈ పుష్కరాలలో దాదాపు 4 కోట్ల 50 లక్షల మంది వరకు పుష్కర స్నానాలు ఆచరించారట. అయితే ఈ ఏడాది ఈ సంఖ్య 10 కోట్లకు చేరుతుంది అని అధికారులు అంచనా వేశారు. ఇక రాబోయే పుష్కరాల కోసం దాదాపు 3000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది అని అధికారులు ముందుగానే భావిస్తున్నారు. ఇందుకోసం కేంద్రం నుంచి మెజారిటీ వాటా తెప్పించుకోవాలనే పనిలో ఉన్నట్లుగా సమాచారం.
Read also : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అలర్ట్!.. అలా చేయకుంటే చర్యలే?
Read also : నువ్వు అరెస్ట్ చేస్తే భయపడాలా.. జగన్ కు వార్నింగ్ ఇచ్చిన లోకేష్





