
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమాట ధరలు భారీగా పడిపోయాయి. టమాటా ధరలు కేవలం 2 రూపాయలు లేదా 3 రూపాయలు పలుకుతుండడంతో పంటలు పండించిన రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. రోడ్లపైనే టమోటాలు పడబోసి న్యాయం చేయాలని కోరుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో గత రెండు మూడు రోజుల నుంచి టమోటా 2 రూపాయలు లేదా మూడు రూపాయలు మాత్రమే పలుకుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిన్న 25 కేజీల టమోటా గంపలను 150 నుంచి 250 రూపాయల లోపు కొనుగోలు చేశారని అన్నారు. ఒక వైపు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కిలో టమోటా కు 8 రూపాయలు దక్కేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలా చేయలేకపోతే కచ్చితంగా టమాటా రైతులం అయినటువంటి మేము తీవ్రంగా నష్టపోతామని… ఇంకోసారి ఈ పంట వేయాలంటేనే భయం కలుగుతుందని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాధికారులు వెంటనే ఈ టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతున్నారు. టమాటా పండించడానికి పెట్టిన పెట్టుబడి కూడా మాకు తిరిగి రావట్లేదని.. ఇలా అయితే ఇలాంటి పంటలు వేసుకుంటూ ఎలా బ్రతకగలమని ప్రశ్నిస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి టమోటా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా గతంలో టమాటాకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులందరూ పండించిన టమాటాలను నాశనం చేసుకోవడం లేదా రోడ్లపై, కాలవలలో పడేయడం చూసాం. ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు.
Read also : ఫైనల్ కు చేరిన ఇండియా.. కానీ ఈ చెత్త ఫీల్డింగ్ ఏంటంటూ ఆవేదన!
Read also : ఇచ్చిన మాట నెరవేర్చిన కూటమి.. అభ్యర్థుల ముఖాల్లో వెలుగులు!