క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14 నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి.
విద్యార్థులను ఉదయం 8:30 నుండి 9:30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్లు ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద సిసి కెమెరాల నిఘా ఉంటుంది మరియు సెల్ఫోన్లను కఠినంగా నిషేధించారు.
