క్రైమ్

మెడికల్ కాలేజీలో మంటలు.. 10 మంది చిన్నారులు సజీవదహనం

శిశువులకు నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో

ఉత్తర ప్రదేశ్‌‌లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది. నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పది మంది శిశువులు సజీవదహనం అయ్యారు. ఒక్కసారిగా మంటల వ్యాప్తించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మెడికల్ కాలేజీ వద్దకు చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

మెడికల్ కాలేజీలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్న శిశువులకు నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికల్ కాలేజీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చేలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది.

మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొని బయటకు పరుగులు తీశారు. అక్కడ ఉన్న గర్భిణులను వారి బంధువులను రెస్క్యూ టీం కాపాడింది. వారిని క్షేమంగా బయటకు తరలించింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే.. జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తోంది. మంటలు, పొగ పీల్చడంతో కొంతమంది చిన్నారుల అస్వస్థతకు గురయ్యారు. వారికి యుద్ధప్రాతిపదికన వైద్యం అందిస్తున్నారు.

ఝాన్సీ ఆసుప్రతి ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని.. ఎలా జరిగిందో విచారణ చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేశ్‌ పాఠక్‌, ఇతర అధికారులు ఆసుప్రతికి చేరుకుని

మరిన్ని వార్తలు చదవండి .. 

మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ

పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్

తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్

చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు

ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం

నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button