
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యములో రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన మునుగోడు మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకరి భిక్షం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాధారణంగా కలిసి పలు ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. వర్కింగ్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహా ఉంచాలని ,సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఉత్తర్వులు ఇవ్వాలని సిఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపు కోసం కీలక భూమిక పోషించి,ఉపాధ్యాయుల సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేసి చెరగని ముద్ర వేసుకున్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 90 మంది ఉన్న విద్యార్ధుల సంఖ్యను 210 కి పెంచడంతోపాటు పాఠశాల విద్య అభివృద్ధిలో సుంకరి భిక్షం గౌడ్ అందరికీ అదర్శ వంతుడు అయ్యాడని, పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నిక కావడంతో పీఆర్ టియు మండల అధ్యక్ష కార్యదర్శులు యూసుప్ పాషా,మేకల అన్నపురెడ్డి లు పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
Read also: టీఆర్పీకి మైలేజ్ దక్కేనా? తెలంగాణలో మల్లన్న పార్టీ ప్రయోగమేనా?
Read also : యూరియా టోకెన్ల కోసం రైతులు ధర్నా