తెలంగాణ

సీఎం రేవంత్ చేతుల మీదుగా ఉద్యోగం.. 25 రోజులు డ్యూటీ చేశాకా ఊస్టింగ్

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నియామకాలు గందరగోళంగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇటీవల ఉద్యోగాలు పొందిన హిందీ పండిట్లను తొలగించడం కలకలం రేపుతోంది. ఏడుగురు హిందీ పండిట్ ఉద్యోగులను టర్మినెట్ చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.అర్హులందరికీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంతో ఆర్భాటంగా ఉద్యోగ నియామక ప్రతాలు అందజేసింది. అయితే ఉద్యోగాలు పోంది 25 రోజులు డ్యూటీలు చేశాక టర్మినెట్ చేశారు విద్యాశాఖ అధికారులు. మూడు సార్లు స్క్రూట్ని చేసి ఉద్యోగులుగా ఎంపిక చేసింది విద్యాశాఖ. ఇప్పుడు నిబంధనల ప్రకారం హిది పండిట్ ఉద్యోగాలకు అర్హులు కాదంటున్నారు విద్యాశాఖ అధికారులు. హిందీ ప్రవీణ,భూషణ్, విశారద సర్టిఫికెట్లు చెల్లవు అంటూ ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉద్యోగ నియామకాలు గందరగోళంగా మారాయి. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఉద్యోగ నియామకాలు ఇచ్చిన టీచర్లకు కొలువలపై నమ్మకం లేకుండా పోయింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నియామకాలు గందరగోళంగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇటీవల ఉద్యోగాలు పొందిన హిందీ పండిట్లను తొలగించడం కలకలం రేపుతోంది. ఏడుగురు హిందీ పండిట్ ఉద్యోగులను టర్మినెట్ చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.అర్హులందరికీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంతో ఆర్భాటంగా ఉద్యోగ నియామక ప్రతాలు అందజేసింది. అయితే ఉద్యోగాలు పోంది 25 రోజులు డ్యూటీలు చేశాక టర్మినెట్ చేశారు విద్యాశాఖ అధికారులు. మూడు సార్లు స్క్రూట్ని చేసి ఉద్యోగులుగా ఎంపిక చేసింది విద్యాశాఖ. ఇప్పుడు నిబంధనల ప్రకారం హిది పండిట్ ఉద్యోగాలకు అర్హులు కాదంటున్నారు విద్యాశాఖ అధికారులు. హిందీ ప్రవీణ,భూషణ్, విశారద సర్టిఫికెట్లు చెల్లవు అంటూ ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించారు.

ఉద్యోగాలు టర్మినెట్ అయిన హిందీ పండిట్ ఉద్యోగులు మయూరి నాగేశ్వరావు, సట్టు రామలింగయ్య, షేక్ నాగుల్ మీరా, దోర్నాల లావణ్య, తాటికొండ నాగలక్ష్మి, తాటికొండ శ్రీదేవి, మెండేటి వెంకట రత్నం. జిల్లా విద్యాశాఖ అధికారుల తప్పిద నిర్ణయంతో ఏడుగురు ఉపాధ్యాయుల జీవితాలు అయోమయంలో పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button