తెలంగాణ

సినిమా యాక్టర్ల బిల్డింగులు‌ కూల్చేస్తం..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా జన్వాడలోని మాజీ మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కారును తీసుకొని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని మరీ వెళ్లి కేటీఆర్ ఫాంహౌస్‌ను చూసి వచ్చానని తెలిపారు. తాను వెళ్లినప్పుడు కేటీఆర్ భార్య అక్కడే ఉన్నారని తెలిపారు.

నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే హైడ్రా అధికారులు కేటీఆర్ ఫాంహౌస్‌ను కూల్చేస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు తెలుసని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని అన్నారు. కేటీఆర్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యుల శ్రద్ధ పెట్టాలని, ఆయనను చూస్తే జాలి వేస్తోందని అన్నారు. పదేళ్లో ఒక్కసారి కూడా అంబేద్కర్ చిత్రపటానికి కేసీఆర్ దండ వేయలేదని చెప్పారు.

 Read More : జనంలోకి కేసీఆర్.. ముహుర్తం ఫిక్స్.. ఆయనకు చుక్కలే!

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ అంటుంటే నవ్వొస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ జన్వాడలో అక్రమంగా ఫాంహౌస్ నిర్మించుకున్నారని చెప్పారు. సినిమా యాక్టర్ల బిల్డింగులు అక్రమంగా ఉన్నా కూల్చేస్తామని స్పష్టం చేశారు. అందరం కలిస్తేనే తెలంగాణ వచ్చిందని, తాము కేసీఆర్ లాగా దొంగ దీక్షలు చేయలేదని అన్నారు.

Back to top button