క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ హీరో నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ లోని అక్రమ కట్టడాల కూల్చివేతపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున సినిమా డైలాగులు చెబుతున్నారని.. ఆయన బిగ్ బాస్ కే బాస్..ఆయనేమి సత్య హరిశ్చంద్రుడు కాదని విమర్శించారు. నాగార్జున నుంచి 10 ఏళ్ల అద్దె వసూలు చేయాలన్నారు. ఇన్ని సంవత్సరాలు రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలన్నారు. కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్ ను పరిశీలించారు కామ్రేడ్లు. మల్లారెడ్డి, పల్లా చెరువుల్లో కాలేజీలు కట్టారని.. MIM వారివి కూడా కూల్చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
నాగార్జునకు చాలా డబ్బులు ఉన్నాయని.. ఆయనకు ఇదంతా లెక్క కాదన్నారు సీపీఐ నారాయణ. ఒక్కడే కూర్చుని 100 మందిని కొట్టేస్తే కుదరదు లాంటి సినిమా డైలాగ్ లు పనికి రావన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు కబ్జా కోరులన్నారు. ఫిరంగి నాలాను కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలని సూచించారు. నోటరీ ద్వారా స్థలాలను అమ్ముతున్నారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ పేదలకు అన్ని వేళలా అండంగా నిలబడుతుందని నారాయణ భరోసా ఇచ్చారు. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.
Read More :కర్నాటక కాంగ్రెస్ సీఎం అవుట్ .. నెక్స్ట్ రేవంత్ రెడ్డెనా.?
రాజకీయ కక్షసాదింపు అవసరం లేదని.. ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదని నారాయణ హితవు పలికారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలన్నారు.అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.