జన్వాడ ఫాంహౌజ్ పార్టీ కేంద్రంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్దం సాగుతోంది. డ్రగ్స్ టెస్టుకు సిద్దమంటూ పోటాపోటీ సవాళ్లు విసురుకుంటున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లు ఏకంగా అపోలో హాస్పిటల్ కు వెళ్లి డ్రగ్స్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చి వచ్చారు. ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ వెంకట్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ నేతలంతా శాంపిల్స్ ఇవ్వడానికి రావాలన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోని కౌశిక్ రెడ్డి చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనిల్ కుమార్ యాదవ్ అన్న కి చెప్తా సదర్ కి ఈ ఆంబోతు(కౌశిక్ రెడ్డి )నీ తీసుకెళ్ళమని అంటూ హాట్ కామెంట్స్ చేశారు. Brs ఆంబోతు కౌశిక్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతుందని అన్నారు. కొకైన్ పాజిటివ్ ఎవరికి వచ్చింది.. పార్టీ ఎక్కడ జరిగింది.. ఎవరెవరు పార్టీలో ఉన్నారని చెప్పకుండా ఇష్యును ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని వెంకట్ ప్రశ్నించారు.
కేటీఆర్ ఫ్రెండ్స్ డ్రగ్స్ తీసుకుంటారు కాబట్టి కేటీఆర్ మీద డ్రగ్స్ తీసుకుంటారని అనుమానం ఉందన్నారు. విజయ్ మద్దూరి తమకు దగ్గర అని కేటీఆర్ చెప్పారు.. విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది కాబట్టి కేటీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసినందుకే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తన మీద 88కేసులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇక్కడి విషయాలు లీక్ చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డికి ఉందన్నారు. ఇక్కడ విషయాలు అక్కడ లీకులు ఇచ్చినందుకే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమ కారుల మీద రాళ్ళు రువ్వినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు.
కేటీఆర్ కు నిజంగా డ్రగ్స్ తీసుకోవడం అలవాటు లేకపోతే డ్రగ్స్ శాంపిల్ టెస్ట్ చేయించుకోవాలని బల్మూరి సవాల్ చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారా లేదా అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కౌశిక్ నోరు అదుపులో పెట్టుకో లేదంటే బయట తిరిగే పరిస్థితి ఉండదని వెంకట్ హెచ్చరించారు.