ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ భారతీ పీఏ అరెస్ట్.. నెక్స్ట్ ఎవరంటే..?

ఆంధ్రప్రదేశ్ లో మాజీ సీఎం జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కుటుంబ వివాదంలో ఇప్పటికే జగన్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు.తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల చేస్తున్న ప్రకటనలు.. విడుదల చేస్తున్న లేఖలతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకే గతంలో ఎప్పుడు లేనట్లుగా జగన్ బంధువల ఇండ్లకు వెళుతున్నారని అంటున్నారు. తాజాగా జగన్ కు మరో షాక్ తగిలింది. ఏకంగా జగన్ సతీమణి వైఎస్ భారతీ పీఏనే పోలీసులు అరెస్ట్ చేశారు.

YCP సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జగన్‌ హయాంలో ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా అసభ్యకర పోస్టులు పెట్టిన రవీందర్‌రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆ తంతు కొనసాగిస్తూనే ఉన్నారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి … రవీందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.

ఎన్నికల సమయంలో షర్మిల , సునీతా రెడ్డిపైనా పలు వ్యక్తిగత విమర్శలు చేశారు. చివరకు జగన్‌ తల్లి విజయమ్మనూ వదల్లేదు. తీవ్ర మనస్తాపానికి లోనైన షర్మిల, సునీత అప్పట్లో హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు. షర్మిల పుట్టుకపైనా పలు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టి వైరల్‌ చేశారు. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చి విచారిస్తున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి ….

విద్యార్థిని తొడ కొరిగిన టీచర్.. ఇంట్లో చెప్తే చంపేస్తా అంటూ బెదిరింపులు

తలకాయే తీసేసారు.. రాహుల్ పర్యటన రోజే దారుణం

భార్యపై కోపంతో కారు యాక్సిడెంట్ చేసిన వ్యాపారి

కేసీఆర్ కు వార్నింగ్.. బాబుకు సపోర్ట్.. ఒవైసీ యూ టర్న్

ట్రంప్‌కే అమెరికా పగ్గాలు.. భారతీయులకు పండగే!

మరో ఆలయంలో దాడి.. తెలంగాణలో అసలేం జరుగుతోంది?

Back to top button