తెలంగాణ

వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్.. పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశాలు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రేవంత్ రెడ్డి సర్కారుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులను సీరియస్‌గా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రోజూ ఏదో ఓ చోట వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తుండగా.. అందుకో కొంత మంది పిల్లలు తమ విలువైన ప్రాణాలు కూడా కోల్పోవటం బాధాకరం. కాగా.. ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు.. వెంటనే పరిష్కార మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించింది.

Read Also : లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్.. కేటీఆర్ ఆగ్రహం.. ఎస్‌ఐపై బదిలీవేటు!!

కుక్కల దాడి ఘటనలు నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం వెల్లడించారు. హైదరాబాదులో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని హైకోర్టుకు సర్కార్ తెలియజేసింది. ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ ఉంటుందన్నారు. అయితే స్టెరిలైజేషన్ ద్వారా ఎలా దాడి ఘటనలను ఆపుతారని హైకోర్టు మరో ప్రశ్న వేసింది.షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నాగపూర్‌లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్‌లో పెట్టినట్టు హైకోర్టుకు అనిమల్ వెల్ఫేర్ తరపున న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని ధర్మాసనం తెలిపింది. అలాగే తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి : 

  1. వ్యాసమహర్షి పురస్కారాలకు చండూరు వాసుల ఎంపిక..
  2. డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ.. తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా
  3. అక్క భర్తను లవ్ చేసిన యువతి.. వద్దని చెప్పిన తల్లిదండ్రులు..చివరకు!!!
  4. కేసీఆర్ మెప్పుకోసమే ఈ ప్రోటోకాల్ డ్రామా.. కాంగ్రెస్ నేతలు
  5. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీకవిత జ్యుడిషియల్ కస్టడీ?

Back to top button