పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాటలో గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. KIMS హస్పిటల్ వచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్ అందించారు. శ్రీ తేజ్ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
కిమ్స్ హాస్పిటల్ దగ్గరే సినిమా వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. ఇక పై తెలంగాణలో నో బెన్ ఫిట్ షోస్ ఉండవన్నారు. అవేమైన దేశ భక్తికి, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా?.మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాల విషయం వేరని అన్నారు. పుష్ప 2 సినిమాను తాను కూడా చూశానన్నారు. ఇకపై చారిత్రక, తెలంగాణ సినిమాలే చూస్తానని చెప్పారు. మూడు గంటల సినిమా సమయంలో చాల పనులు చేసుకోవచ్చని సూచించారు. సినిమాలతో యువత చెడిపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి.
ఇకపై తెలంగాణలో నో బెన్ఫిట్ షో, నథింగ్ ఉండవన్నారు. సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని.. పోలీసు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటకి వెళ్లొద్దని హెచ్చరించారు. షోలు చేయడానికి బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో షో చేస్తే తాట తీస్తామని హీరోలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ కావొద్దన్నారు.