తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా పాలనపై ఇంకా పూర్తి స్థాయిలో పట్టు రాలేదని తెలుస్తోంది.ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు లీక్ అవుతుందనే సమాచారం వస్తోంది. కొంత మంది అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని గులాబీ లీడర్లకు చేరవేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లు.. ఇతరత్రా అంశాలపై కేటీఆర్, హరీష్ సహా ముఖ్యనేతలు ప్రెస్ మీట్లు పెడుతుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
మంత్రివర్గ నిర్ణయాలు, స్కీంలకు సంబంధించిన సమీక్షలు, నిధుల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగియగానే ఆ సమాచారం మొత్తం తెలంగాణ భవన్ కు చేరుతుందంటున్నారు. ఈ వెంటనే కేసీఆర్ టీం ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో
పాలనకు సంబంధించి రహస్య అంశాలను కొందరు బ్యూరోక్రాట్లు లీక్ చేస్తున్నారనే నిర్ధారణకు ప్రభుత్వ పెద్దలు వచ్చారని తెలుస్తోంది.ఈ విషయంలో కొందరు అధికారులకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారంటున్నారు. అయినా కొందరి తీరు మారడం లేదని సచివాలయంలో చర్చ సాగుతోంది.
ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారులు లైట్ తీసుకుంటున్నారని..ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారంటున్నారు ప్రభుత్వ హెచ్చరికలను అధికారులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు ? ఎందుకు బ్యూరోక్రాట్లు ఇంకా గులాబీలతో చెట్టాపట్టాల్ వేసుకొని ఉన్నారు? కాంగ్రెస్ పవర్ లోకి వచ్చి పది నెలలు అవుతున్నా..రేవంత్ సర్కార్ ఎందుకు అధికారుల మనసును గెలవలేకపోతోంది అనే చర్చ జరుగుతోంది.