
క్రైమ్ మిర్రర్, మేడ్చల్ : మేడ్చల్ లో దారుణ హత్య కలకలం రేపింది. తండ్రి కొడుకుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ భయానక హత్యగా మారింది. మద్యం మత్తులో తండ్రిని స్వయాన కొడుకే బండరాయితో కొట్టి చంపిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్, తన కొడుకు షేక్ సాతక్తో కలిసి కొంతకాలంగా మేడ్చల్‌లో నివాసముంటున్నారు.
Also Read: రేపే సెకండ్ వన్డే… రికార్డ్స్ అన్ని మన వైపే..?
మంగళవారం రాత్రి సాతక్ తన స్నేహితుడు రాజుతో కలిసి మద్యం సేవించగా, ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి కొడుకుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న సాతక్ ఆగ్రహంతో బండరాయి తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సాతక్‌తో పాటు అతని స్నేహితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మద్యం మానవత్వాన్నే మింగేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:తెలంగాణలో మరో 4 రోజులు పాటు వర్షాలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్!