Monday, February 23, 2026
Homeతెలంగాణమూసీలోకి బుల్డోజర్లు.. చాదర్ ఘాట్ లో కూల్చివేతలు

మూసీలోకి బుల్డోజర్లు.. చాదర్ ఘాట్ లో కూల్చివేతలు

మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. చాదర్ ఘాట్ ఏరియాలోకి బుల్డోజర్లు వచ్చేశాయి. ఖాళీ చేసిన ఇళ్లను కూల్చి వేస్తున్నారు అధికారులు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్ , రసూల్ పురాలో RBX పరిధిలోని మూసీ పరివాహక ఇళ్లను కొందరు ఖాళీ చేసి వెళ్లారు. ఆ ఇండ్లను మార్కింగ్ చేసిన అధికారులు కూల్చేశారు. మూసీ పరివాహిక ఏరియాలో ఉన్న కుటుంబీకులను ఇప్పటికే ఖాళీ చేయించి చంచల్ గూడలో ఉన్న ప్రభుత్వ 2BHK ఇళ్లను కేటాయించారు అధికారులు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments