
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా కేసును వేసినటువంటి నాగార్జున తాజాగా ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం మంత్రి కొండ సురేఖ సోషల్ మీడియా వేదికగా.. కోపంలో అలా వాగేసాను అని… తాను చేసిన వ్యాఖ్యలు పట్ల పశ్చాతాపం తెలియజేస్తూ క్షమాపణలు కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. నాగార్జునను అలాగే తన కుటుంబాన్ని కావాలనే కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదు అని.. వారు బాధపడి ఉంటే అందుకు నేను చింతిస్తున్నాను అని.. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని మంత్రి కొండ సురేఖ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ విషయాన్ని కూడా అర్ధరాత్రి 12 గంటలకు సమయంలో సురేఖ ట్విట్ చేయడం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే తాజాగా హీరో నాగార్జున కేసును విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున కేసును వెంటనే విత్ డ్రా చేసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. మంత్రి కొండ సురేఖ నాదే తప్పు అని.. నేను అన్న మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పడం కారణంగానే నాగార్జున కేసును విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తుంది. సమంత విడాకుల విషయంలోనే మంత్రి కొండ సురేఖ గతంలో నాగార్జున ఫ్యామిలీ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా కేసు వేయగా అది నేటితో ముగిసిపోయింది.
Read also : CM Revanth Reddy: హైదరాబాద్ రోడ్లకు ప్రముఖ కంపెనీ పేర్లు
Read also : ఢిల్లీ కాలుష్యం పై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం?





