క్రైమ్

బీదర్ దొంగలు కాల్చేస్తరు.. హైదరాబాదీలు బీ అలెర్ట్

హైదరాబాద్ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బీదర్ దొంగలు నగరంలో తిరుగుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొంగల దగ్గర తుపాకులు ఉన్నాయని.. ఎదురుపడితే కాల్చేస్తారని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలని.. వెంటనే పోలీసులకు సమాచాం ఇవ్వాలని హైదరాబాదీలకు పోలీసులు అలర్ట్ చేశారు.

గురువారం ఉదయం కర్ణాటకలోని బీదర్ లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు దుండగులు..ఏటీఎంలోకి డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి 93 లక్షలతో పరార్ అయ్యారు. నేరుగా బీదర్ నుండి హైదరాబాద్ వచ్చారు దుండగులు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో అఫ్జల్గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ కు చేరుకున్నారు నిందితులు. హైదరాబాద్ నుండి చతిస్గడ్ లోని రాయపూర్ కి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు ఇద్దరు దుండగులు. రాత్రి 7:30 గంటలకు అఫ్జల్గంజ్ నుండి రాయపూర్ కు బస్సు బయలుదేరాలి.

అయితే బస్సులోకి ప్రయాణికులను అనుమతించిన తర్వాత వారి లగేజీలను తనిఖీ చేశారు టికెట్ మేనేజర్ జహంగీర్. అదే సమయంలో నిందితుల బ్యాగులను తనిఖీ చేయడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు దుండగులు. ఓ కేసులో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులు.. అదే బస్సులో కూర్చున్నారు. తాము పోలీసులమని తమ బ్యాగ్ తనిఖీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ విషయాన్ని విని బీదర్ పోలీసులు తమ కోసమే వచ్చారంటూ భావించారు దుండగులు. అదే సమయంలో దుండగుల బ్యాగ్ తనిఖీ చేయాలని పట్టుబట్టాడు జహంగీర్. దీంతో జహంగీర్ కు 50 వేల రూపాయలు ఇచ్చి తమ బ్యాగ్ తనిఖీ చేయొద్దు అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు నిందితులు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కిందకు దిగాలని హెచ్చరించాడు జహంగీర్.దీంతో వారు బ్యాగులతో పాటు కిందకు దిగగా పోలీసుల భయంతో తప్పించుకోవడానికి జహంగీర్ పై కాల్పులు జరిపారు. సుమారు నాలుగు నుండి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు నిందితులు. కాల్పులు జరిపి డబ్బుతోపాటు అక్కడి నుండి పరారయ్యారు.

జహంగీర్ పొట్ట కాలుభాగంలోకి దూసుకు వెళ్లింది బుల్లెట్ . సుమారు 200 మీటర్లు ప్రాణ భయంతో పరుగులు తీసి రోషన్ ట్రావెల్స్ వద్దకు చేరుకున్నాడు జహంగీర్. అక్కడే కుప్పకూలిపోవడంతో ఉస్మానియా ఆసుపత్రికి జహంగీర్ను తరలించిన రోషన్ ట్రావెల్స్ యాజమాన్యం. అనంతరం సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.
ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button