క్రైమ్ మిర్రర్, జూబ్లీహిల్స్ :- తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లో భాగంగా 101 ఓట్లు పోలవ్వగా… ఇందులో నవీన్ యాదవ్ లీడింగ్ లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. అయితే ఎన్ని ఓట్లు అనేది మరికాసేపట్లో తెలియనుంది. అనంతరం ఇక ఈవీఎం ఓట్లను లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మండల వారీగా ఓట్ల లెక్కింపును కొనసాగిస్తుండగా మొదటగా షేక్పేట్ మండలం నుంచి ఓట్లను కౌంట్ చేయనున్నట్లుగా సమాచారం. ఎప్పటికప్పుడు వేగంగా న్యూస్ కోసం మన క్రైమ్ మిర్రర్ వెబ్సైట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండండి.





