
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో సినిమా టికెట్ల ధరలు పెరిగిపోయాయి అని చాలామంది కూడా థియేటర్లకు వెళ్లడం మానేసి మొబైల్ ఫోన్ లోనే ఏదో ఒక ఆప్, వెబ్సైట్స్ లో ఫ్రీగా వస్తాయి కదా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సినిమాలను విడుదలైన మరుసటి రోజునే పైరసీ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో చాలా మంది థియేటర్లకు వెళ్లడం మానేసి ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా ఈ పైరసీ చేసినటువంటి వెబ్సైట్స్ అలాగే యాప్స్ లలో సినిమాలు చూస్తున్నారు. తాజాగా ఐ బొమ్మ వెబ్సైట్ను ఆపివేసి దీని నిర్వహకుడు రవిని అరెస్ట్ చేసిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫ్రీ సినిమాల కోసం తమ పర్సనల్ డేటా అలాగే సెక్యూరిటీని రిస్క్ లో పెట్టుకోవద్దు అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీవ్రంగా హెచ్చరించింది. తెలియనటువంటి ఆప్స్ మరియు వెబ్సైట్లో లభించే పైరసీ చేసినటువంటి కంటెంట్ చూస్తే ఖచ్చితంగా సైబర్ రిస్క్ అలాగే లీగల్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని స్పష్టం చేసింది.
Read also : తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రమాణ స్వీకారోత్సవాల జాతర..!
తాజాగా కొన్ని లక్షల మంది వాడుతున్నటువంటి PIKASHOW యాప్ కూడా సురక్షితం కాదు అని తేల్చి చెప్పింది. ఈ యాప్ ద్వారా మొబైల్ లోకి వచ్చేటువంటి మాల్వేర్ అలాగే స్పైవేర్ తో బ్యాంక్ అకౌంట్ వివరాలు చోరీ చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే కొన్ని వేలమంది ఈ యాప్ ను అన్ ఇన్స్టాల్ చేశారు. ఇంకా కొంతమంది మాత్రం ఈ యాప్ ను ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసు అధికారులు అలాగే సైబర్ సంబంధిత అధికారులు చాలా ఆగ్రహంతో, పట్టుదలతో పని చేస్తున్నారు. త్వరలోనే వీటన్నిటిని కూడా ఆపివేసే ప్రయత్నాలు చేస్తామని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి పైరసీ చేసినటువంటి వెబ్సైట్లు మరియు యాప్స్ లలో సినిమాలను చూడకండి అని సూచించారు.
Read also : పూసలు అమ్ముకునే మోనాలిసా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?





