క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి నియోజకవర్గ నిఘా ప్రతినిధి : మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామ రెవిన్యూ ఫిరోజ్ నగర్ గ్రామానికి చెందిన ఓ దొర గ్రామస్తుల మధ్య 181 ఎకరాల భూ వివాదం రాష్ట్రం లోనే చర్చనీయంగా మారింది. ఫిరోజ్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సి, బీసీ మధ్య తరగది కుటుంబాలకు చెందిన 46 మంది రైతులు గత 60 సంవత్సరాల క్రితం నుండి 328,544 పలు సర్వే నెంబర్ల లో వున్నా 181 ఎకరాల భూముని సాగు చేసుకుంటూ జీవన ఉపాధి పొందుతున్నారు.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండ్ల గ్రామానికి చెందిన మందుముల వెంకటరామారావు, జానకి రామారావు విరిద్దరు అన్నతముళ్లు కొంత కాలంగా అక్కడ స్థానికంగా ఉపాధి దొరాకక పోవడం తో బ్రతుకు దెరువు కు నాగిళ్ళ గ్రామానికి వలుసా వచ్చి కొన్ని రోజులు గడిచిన తర్వాత అ ప్పుడున్న కొందరు రెవిన్యూ అధికారులు చదువుకున్న వ్యక్తులుగా వున్నా మందుముల వెంకట రామారావు ని భూములకు సంబంధించిన సర్వే కొలతలకు తీసేకెళ్లేవారాని గ్రామస్తులు పేర్కొన్నారు.
Read Also : గాంధీ హాస్పిటల్ వద్ద ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే!!
అదే అదునుగా భావించిన మందుముల వెంకట రామారావు రెవిన్యూ అధికారులను లోబడుచుకొని స్థానికంగా స్థావురం ఎంచుకున్న నాగిళ్ళ గ్రామ భూ రికార్డు లను 1965 సంవత్సరం నుండి 2020 వరకు వీ ఆర్ ఓ మరి కొందరు ఎమ్మారో లతో కుమ్మక్కై పహాణీలు, ఆర్ ఓ ఆర్ లలో రైతుల పేర్లు వున్నా రికార్డు లను సైతం కనుమరుగు చేసి కొత్త గా భూ రికార్డు లను మందుముల వెంకట రామారావు తానే స్వయంగా రాసుకొని రికార్డు గదిలో భద్ర పరిచరని తెలిపారు.రెవిన్యూ యాక్ట్ ప్రకారం ఇనాం భూములు 1970 నుండి 1975 మధ్య కాలంలో భూమి ఎవరు సాగు చేసుకుంటున్నారో రికార్డు లను పరిశీలించి ఓ ఆర్ సీ తో భూమి వారి పేర్లపై పట్ట పాసుబుక్ మంజురు కావాలి అవేవి మాకు వర్తించవు అన్నట్లు అడ్డదరుల్లో మందుముల వెంకట రామారావు 2018 సంవత్సరం లో ఫిరోజ్ నగర్ గ్రామానికి చెందిన 46 మంది రైతులకు 181 ఎకరాలకు ఓఆర్ సీ ఇప్పిస్తా అంటూ ఒక్కొక్కరి వద్ద 1 లక్ష రూపాయలు డబ్బులు వస్సుళ్ళు చేసుకొని 2020 సంవత్సరం లో మందుముల కుటుంబీకులు మొఖ పంచనామా నిర్వహించడ తప్పుడు పత్రాలను సృష్టించి అడ్డా దారుల్లో అధికారులకు కాసులు సమర్పించుకొని అప్పుడున్న ఇబ్రహీంపట్నం ఆర్ డి ఓ అమరేందర్ పదవి విరమణ పొందే ముందు ఓ ఆర్ సీ మంజూరు చేశారని రైతులు పేర్కొన్నారు .
Also Read : అమ్మ జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు — గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
ఈ విషయం పై రైతులు మందుముల కుటుంబీకులను ఓ ఆర్ సీ ఇప్పిస్తా అంటూ మోసం చేశావాని గ్రామం లో నీలాదియగా హైదరాబాద్ పరరాయ్యరు . ఈ భూ వ్యవహారం పై పలు మార్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్ డి ఓ ఎమ్మార్వో లకు వినతిపత్రం అందజేసి జరిగిన అన్యాయం గురించి వివరించి కోర్ట్ ని ఆశ్రమించమని అన్నారు.నాగిళ్ళ గ్రామానికి చెందిన భూ రికార్డు లు 1965 నుండి 1976 వరకు మాయం చేశాడని వెంకట రామారావు పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన అయన పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు .
రికార్డు లను ట్యాంపరింగ్ చేసాడని ఆర్ డి ఓ ఎమ్మార్వో కి పిర్యాదులు చేసిన పోరెన్సిక్ ల్యాబ్ కి పంపడం లేదన్నారు.ఎప్పటి మాదిరిగా ఈ సంవత్సరం గ్రామానికి చెందిన 46 మంది రైతులు పంటలు వేస్తున్న సమయం లో ఇబ్రహీంపట్నం ఆర్ డి ఓ మందుముల కుటుంబీకులకు అండగా నిలిచి రైతులను భూమి మొఖ పైకి పోకుండా 145 సెక్షన్ విధింఛి రైతులకు అన్యాయం చేశారని అన్నారు.ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల ముందు మాడ్గుల తహసీల్దార్ గా వున్నా నిరంజన్ రావు బదిలీ కాగా అయన స్థానం లో మాడ్గుల తహసీల్దార్ గా డిప్టెషన్ లో సునిల్ ఛార్జ్ తీసుకున్నారు.
Read Also : ఉప్పల్ బగాయత్‌లో దారుణం.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి!
మందుముల వారసులు, ఫిరోజ్ నగర్ రైతులు ఇరు వర్గాలు కోర్ట్ లో కేసులు వేసుకున్నారు. ఈ నేల మెదటి వారం లో మాడ్గుల తహసీల్దార్ మందుముల వారసులతో కుమ్మక్కై రైతులకు ఎటువంటి సమాచారం, నోటీసు లు ఇవ్వకుండా 181 ఎకరాల భూమి సర్వే నెంబర్లు మొత్తం బ్లాక్ చేయడం వెనుల రహస్య ఏంటని రైతులు ఎమ్మార్వో తీరు పై మండిపడుతున్నారు.గత కొన్ని రోజులుగా తహసీల్దార్ మందుముల వరసులతో ఏదో డీల్ కుదిరించు కొని ఈ కార్యకలాపాలు చేస్తూ రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దృష్టికి తీసుక పోయాం అని తెలిపారు.
ఎమ్మెల్యే రైతుల పక్షాన నిలిచి న్యాయం చేయాలనీ వేడుకున్నారు. మాడ్గుల మండలం లో ధరణి అప్లికేషన్ లు వేలలో పెండింగ్ లో వున్నా పట్టించుకొని ఎమ్మార్వో మందుముల వారసులు ఒకే రోజు అప్లికేషన్ మీ సేవ లో అప్లయ్ చేసి తీసుకొస్తే ఎలా బ్లాక్ చేస్తారని అగ్రహావ్యక్తం చేశారు.ఏక పక్షంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఎమ్మార్వో పై జిల్లా రెవిన్యూ అధికారులు ఎ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి :
- కాంగ్రెస్ పార్టీలోకి రావద్ధంటు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి దిష్టిబొమ్మ దహనం..
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు వసూళ్ల కాంట్రాక్ట్ నుండి వైదొలగిన జీఎమ్మార్ సంస్థ
- తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
- లక్కీ యెస్ట్ ఫెల్లో.. ఇద్దరు భార్యల చేతుల మీదుగా ముచ్చటగా మూడో పెళ్లి!!
- నేటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు.. కొత్తచట్టం ప్రకారం సామూహిక అత్యాచారానికి మరణశిక్ష