Tuesday, February 24, 2026
Homeతెలంగాణప్యాంట్‌ జిప్‌ తీసి బలవంతం.. జానీ మాస్టర్ బాగోతం లీక్

ప్యాంట్‌ జిప్‌ తీసి బలవంతం.. జానీ మాస్టర్ బాగోతం లీక్

టాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ లైగింక వేధింపుల కేసులో మరిన్ని సంచనాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో బాధితురాలు మొత్తం చెప్పేసింది. జానీ మాస్టర్ అరాచకాలన్ని బయటపెట్టింది. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన డ్యాన్సర్‌ స్టేట్‌మెంట్‌ సంచలనం రేపుతోంది.

షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో జానీ మాస్టర్ తనను బలవంతం చేశాడని.. కోరిక తీర్చమని తనను ఎంతో వేధించాడని తెలిపింది. తన కోరిక తీర్చ లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని కూడా బెదిరించాడు అని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కూడా జానీ మాస్టర్ నాపై ఒత్తిడి చేశాడు అంటూ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు.ఒక రోజు షూటింగ్‌ టైమ్‌లో కారవాన్ వ్యాన్‌లోకొచ్చి దారుణంగా ప్రవర్తించాడని బాధితురాలు వెల్లడించింది. ప్యాంట్‌ జిప్‌ తీసి బలవంతం చేశాడని తెలిపింది. సెక్స్ కోరిక తీర్చమని నన్ను వేధించాడని.. లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది.

జానీ మాస్టర్ బాధితురాలి నుంచి ముగ్గురు మహిళా పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారించారు పోలీసులు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లిన పోలీసులు, వైద్య పరీక్షలు కూడా చేయించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments