తెలంగాణ

పాతబస్తీ హిందువులదే.. వాళ్లను తరిమేస్తం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : గణేష్ నిమజ్జనోత్సవంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. పాతబస్తీలో పర్యటించిన సంజయ్.. పలు వినాయక మండపాలను దర్శించుకున్నారు. బాలాపూర్ గణనాథుడికి చార్మీనార్ దగ్గర స్వాగతం చెప్పారు బండి సంజయ్. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

పాత బస్తీలోని ప్రతీ గల్లిలో గణేష్ పండుగ ఘనంగా జరుగుతుందన్నారు బండి సంజయ్. హిందూ సమాజానికి ఏదైనా సమస్య వస్తే ముందుకు వచ్చేవారు హిందువులన్నారు. పాతబస్తీ పక్కా హిందువులదేనన్నారు. పాత బస్తీ వదిలి వెళ్ళిన హిందువులంతా తిరిగి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేవరకు ఊరుకోబోమన్నారు.

Read More : బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు సీరియస్

పాతబస్తీలో ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన వాళ్లని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు బండి సంజయ్. హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మ రక్షణ కోసం సమయం కేటాయించాలన్నారు. భాగ్యలక్ష్మి
అమ్మవారి పాదాల సాక్షిగా భారత్ మాతా కి జై అని నినదించాలన్నారు సంజయ్. గణేష్ ఉత్సవాల్లో భక్తి, దేశభక్తి కలసి ఉంటాయన్నారు. హిందూ సమాజం, దేశం పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే అందరం ఒక్క తాటి పైకి రావాలన్నారు. హిందూ పండుగలు చేసుకోవాలంటే అన్ని పర్మిషన్లు కావాలి.. కానీ వేరే పండుగలకు ఎలాంటి ఆంక్షలుండవన్నారు బండి సంజయ్. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పోరాటం చేస్తే ట్యాంక్ బండ్ పై నిమజ్జనం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రంజాన్ పండుగకు రూ.3కోట్లు కేటాయించింది కానీ.. హిందూ పండగలకు డబ్బులు కేటాయించలేదని బండి సంజయ్ విమర్శించారు.

Back to top button