తెలంగాణ

పర్యాటకులకు కనువిందు చేస్తున్న తెలంగాణ నయాగరా బోగత జలపాతం..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం అందాలు పర్యటకులకు కనువిందు చేస్తుంది. తొలకరి వర్షాలకు బోగత జలపాతం పరవళ్లు తోకుతుంది. రెండు రోజులుగా ఎగువన ఛత్తీస్గడ్ అటవీప్రాంతంలో కురిసిన వర్షాలకు జలకళ సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తునుండి దిగువకు ప్రవహిస్తున్న నీటిదార పర్యాటకులకు కనువిందు చేస్తుంది.

దట్టమైన అటవి ప్రాంతం గుండా వ్రావహిస్తూ వస్తున్న జల సవ్వడితో జలపాతం అందాలను చూస్తూ పర్యటకులు మురిసిపోతున్నారు. వర్షాలతో నిండిన జలపాతం అందాలను చూడడానికి కుటుంబ సభ్యులతో కలసి పర్యటకులు వస్తున్నారు. వీరితో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నిర్దేశిత ప్రాంతం వరకు మాత్రమే అనుమతి కల్పించి ఇనుప కంచేను ఏర్పాటు చేశారు భద్రత సిబ్బంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీ.. నేడు సమావేశాలు, రేపు ఢిల్లీకి!!
  2. అవినీతి ఆరోపణలు, తోటి సిబ్బందితో గొడవ.. ఎస్సై ఆత్మహత్యాయత్నం!!
  3. ఆపార్టీలోనే నాప్రయాణం.. పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి!!
  4. ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు!!
  5. ఇదేమి పోలీసింగ్… సార్లు?!… తెలంగాణ పోలీసుల వ్యవస్థకే తలవంపులు తెచ్చేలా చింతపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డు బిహేవియర్
Back to top button