
కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై అంతర్జాతీయంగా ఖండనలు వస్తున్నాయి. 27 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను పట్టుకుని కాల్చేపారేయాలని డిమాండ్లు వస్తున్నాయి. కాశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు.
కశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసాక ప్రశాంతంగా ఉందన్నారు రాజాసింగ్. కాశ్మీర్ ను కేంద్రం డెవలప్ చేసిందని చెప్పారు.
పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టు లు వచి కశ్మీర్ ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారని ఆరోపించారు. టూరిస్టుల పై దాడి చేయడం దారుణమన్నారు రాజాసింగ్. పేరు అడిగి మరీ హిందువులను చంపేశారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కాశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోడీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతుందని రాజాసింగ్ చెప్పారు. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకుని చంపేవరకు మోదీ, అమిత్ షా వదలరని తెలిపారు. కొందరు కాశ్మీర్ స్థానికులు ఉగ్రవాదులకు సపోర్ట్ చేశారన్నారు. హిందువులు అందరూ అమర్ నాథ్, విష్ణు దేవి యాత్ర కు వెళ్లాలని.. కానీ స్థానికంగా ఏం కొనవద్దని రాజాసింగ్ సూచించారు.