తెలంగాణ

దంచికొట్టిన వాన.. వణికిపోయిన హైదరాబాద్

రెండు వారాలు రెస్ట్ ఇచ్చిన వరుణుడు మళ్లీ బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. సడెన్ గా ఎంట్రీ ఇచ్చి దుమ్ము రేపుతున్నాడు. తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం తర్వాత రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ సహా పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా కురుసిన వర్షానికి వరద పోటెత్తింది. జనాలు ఇబ్బంది పడ్డారు.

గ్రేటర్ పరిధిలో రాత్రి అకస్మాత్తుగా వర్షం దంచికొట్టింది. రాత్రి 9 గంటల సమయంలో మొదలైన వాన.. తెల్లవారుజాము వరకు పడుతూనే ఉంది. చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్ నగర్, బోడుప్పల్, ఉప్పల్, పీర్జాదిగూడ, మలక్​ పేట, దిల్​ షుక్ నగర్, చాదర్ ఘట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, కీసర, అబిడ్స్, నాంపల్లి, కోఠి, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, మణికొండ, నార్సింగి, గండిపేట్, బండ్లగూడ జాగీర్, హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, పంజాగుట్ట, ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జోరు వాన పడింది.

రెండు గంటల పాటు కుండపోతగా వర్షం కురవడంతో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇండ్లలోకి మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు ఆటంకం కలిగింది. అయితే అర్ధరాత్రి వర్షం కురవడంతో పెద్దగా ట్రాఫిక్ సమస్యలు రాలేదు.

Back to top button