క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బ్లస్టర్ మూవీ పుష్ప2 దేశంలోనే సంచలనంగా మారింది. చరిత్రలో ఎప్పుడు లేనంతగా వసూళ్లు రాబడుతూ సరికొత్త చరిత్ర స్పష్టిస్తోంది. ఐదు రోజుల్లోనే పుష్ప2 కలెక్షన్లు వెయ్యి కోట్ల రూపాయలు క్రాస్ అయ్యాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే బన్నీ వసూళ్లు 1500 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. తెలుగు కంటే బాలీవుడ్ లో ఊహించనంతగా వసూళ్లు రాబడుతోంది పుష్ప2. ఐదు రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. గతంలో ఏ బాలీవుడ్ సినిమాకు కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.
Read More : రెడ్ లైట్ ఏరియా గా మారిపోయిన ఎల్బీనగర్!.. జర భద్రం?
పుష్ప2 ఇప్పుడు ఉత్తరాదిని ఉపేస్తోంది. పుష్ప క్రేజ్ ను రాజకీయ పార్టీలు వాడేసుకుంటున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో పుష్ప వార్ సాగుతోంది. ప్రధాన పార్టీలను పుష్ప సినిమా అధారంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో ఆధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. ‘పుష్ప 2’ చిత్రంలోని పాపులర్ డైలాగ్ ‘తగ్గేదేలే’ అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు ‘చీపురు’ చేత పట్టుకున్న పోస్టర్‌ను ఆప్ విడుదల చేసింది. అందుకు దీటుగా బీజేపీ అవినీతిపై ‘రప్పా రప్పా’ పేరుతో పోస్టర్లు రిలీజ్ చేసింది.
Read More : రూపాయి నాణేలతో ఐఫోన్ కొని షాక్ ఇచ్చిన బిచ్చగాడు?